Sunday, 26 July 2026 04:46:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భర్తకు కరెంట్‌ షాక్‌ పెట్టి ఘోరంగా హత్య...

Date : 23 April 2025 12:03 PM Views : 779

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : భర్తపై విరక్తి చెందిన ఓ భార్య చెల్లెలి భర్తతో కలిసి అతనికి కరెంట్‌ ఇచ్చి హత్య చేసింది. హత్య తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టి.. సొంతూరుకు వెళ్లిపోయింది. భర్త ఎక్కడని కుటుంబసభ్యులు నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది.... KPHBలో ఓ మహిళ భర్తపై విరక్తి చెంది అతన్ని చంపి పూడ్చిపెట్టిన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సాయిలు అనే వ్యక్తికి కవిత అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో కొన్నేళ్లుగా భార్య భర్తలు వేరుగా ఉంటున్నారు. అయితే ఈ భార్య భర్తలు ఇద్దరికి వేరే వ్యక్తులతో వేరువేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ వేర్వేరుగా ఉన్నప్పటికీ భర్త సాయిలు, భార్య కవితను వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో.. భర్త వేధింపులు భరించలేక పోయిన కవిత అతన్ను హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. అనుకున్న ప్రకారం చెల్లెలి భర్త సహాయంతో భర్త సాయిలుకు కరెంట్‌ షాక్ ఇచ్చి హత్య చేసింది భార్య కవిత. సాయిలు మృతదేహాన్ని ఒక స్థలంలో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత తన చెల్లిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఈ హత్య తర్వాత కవిత వాళ్ల సొంతూరుకు వెళ్లిపోయింది. సాయిలు గురించి కుటుంబ సభ్యులు గ్రామస్తులు అడగ్గా.. పని కోసం అని వెళ్లిన సాయిలు కొన్ని రోజులుగా ఇంటికి తిరిగి రాలేదని కవిత చెప్పింది. కవిత మాటలపై అనుమానం వచ్చి సాయిలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సాయిలు హత్య ఉదంతం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :