సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం కూతురు సుష్మిత ఆల్ ఇండియాలో 384 ర్యాంకు సాధించింది. ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలోనే అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు హాజరైనట్టు తెలుస్తోంది. దేశం మొత్తం మీద 2,529 మంది అభ్యర్ధులు ఇప్పటికే ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి 384వ ర్యాంక్ సాధించిన సుస్మితను వై ఎస్ ఆర్ టీ పి షాద్ నగర్ ఇంచార్జ్ ఇబ్రహీం అభినందించారు. ర్యాంక్ సాధించి ఐపియస్ కు సెలెక్ట్ కావడం ఎంతో సంతోషకరమైన విషయం అని ఇది షాద్ నగర్ కే గర్వకారణం అని అన్నారు. ఇందులో వై ఎస్ ఆర్ టీ పి నాయకులు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin