Sunday, 26 July 2026 10:38:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణలోనూ మరో నాయకుడి పాదయాత్ర...

Date : 12 November 2022 11:30 PM Views : 528

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఆయన తెలంగాణ మొత్తం చుట్టేలా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ కూడా అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వర్గీయులు ఇప్పటికే పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ వంటి అంశాలపై కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఖచ్చితంగా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఆరు నెలల్లో తెలంగాణ మొత్తం పాదయాత్ర పూర్తి చేసి ఆ తర్వాత .. ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది... తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. దాదాపుగా రెండు వారాల పాటు సాగిన పాదయాత్రలో మంచి జోష్ వచ్చిందని.. రాహుల్ గాంధీపై చాలా పాజిటివ్ అభిప్రాయం ఏర్పడిందని.. దాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేందుకు తెలంగాణ నేతలు పని చేయాల్సి ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. ఈ ప్రకారం రేవంత్ రెడ్డి తన పాదయాత్ర ప్రణాళికల్ని రాహుల్ ముందు ఉంచినట్లుగా చెబుతున్నారు. పాదయాత్రతో పాటు మునుగోడు ఉపఎన్నికలనూ ఒంటి చేత్తో రేవంత్ రెడ్డి సమన్వయం చేశారు. రేవంత్ పనితీరు రాహుల్ గాంధీకి బాగా నచ్చడంతో పాదయాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎప్పట్నుంచో చేస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవి దక్కిన తర్వాత మొదట అదే పని చేద్దామనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయాల వల్ల సాధ్యం కాలేదు. ఓ సారి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకూ చేసిన పాదయాత్రపై అనేక ఫిర్యాదు హైకమాండ్‌కు వెళ్లాయి. అదే సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను కూడా పాదయాత్ర చేస్తానని హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు ఆయన పై పార్టీ హైకమాండ్ కూడా నమ్మకం కోల్పోయింది. దీంతో రేవంత్‌కు లైన్ క్లియర్ అయినట్లంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: