సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : మేళ్లచెరువు మండల కేంద్రంలో సోషల్ మీడియా కన్వీనర్ చిన్నపంగు పుల్లయ్య అధ్యక్షతన సోషల్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమానికి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సూరిశెట్టి బసవయ్య , మఠంపల్లి సోషల్ మీడియా కన్వీనర్ శివారెడ్డి, షేక్ కైఫ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గ్రామాలలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసి మరల శానంపూడి సైదిరెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని గ్రామాల సోషల్ మీడియా వారియర్స్ కు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ... మేళ్లచెరువు గ్రామ పార్టీ అధ్యక్షులు కూన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండల యూత్ అధ్యక్షులు బత్తుల శివ మండలంలోని అన్ని గ్రామాల సోషల్ మీడియా వారియర్స్ పాల్గొ న్నారు....
-----------------------
Admin