సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి.వి సిద్ధారెడ్డి కార్యాలయం నందు ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ డి.ఈ షామీర్ భాష, ఎ.ఈ లు మరియు వర్క్ ఇన్స్పెక్టర్ లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా గల అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కదిరి నియోజకవర్గంలో గల అన్ని మండలాలను అహుడ లో చేర్చడం వల్ల హౌసింగ్ మంజూరు చేయడంలో ఏమాత్రం ఆలస్యం కాదని, దానికి అనుకూలంగా మనమంతా సమిష్టిగా కృషిచేసి లబ్ధిదారులకు మంచి జరిగే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే పి వీ సిద్ధారెడ్డి అధికారులకు సూచించారు.
-----------------------
Admin