సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో గణనాథులు నవరాత్రులు జరుపుకొని ప్రత్యేక పూజలు అందుకొని గురువారం రోజు నిమజ్జనానికి శోభయాత్రగా బయలుదేరాయి. నవరాత్రుల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరిపించి గణనాధుల నిమజ్జనానికి వీడ్కోలు పలికారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో వినాయక నిమజ్జన వీడ్కోలు మహోత్సవo సందర్భంగా ఎమ్మెల్యే వనమా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల విఘ్నాలు తొలగాలని ప్రధమ పూజ చేసి జెండా ఊపి గణనాధులకు నిమజ్జనానికి సాగనంపారు. గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కె.వి.రంగా కిరణ్, ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు కంచర్ల చంద్రశేఖర్, డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి శ్రీనివాసరావు, ఆర్డీవో శిరీష, ఉత్సవ కమిటీ, ఆధ్వర్యంలో శ్రీ విజయ విఘ్నేశ్వర (గణేష్ టెంపుల్) ఆలయ గణనాధులకు ప్రత్యేక పూజా కార్యక్రమలు జరిపించి శోభయాత్రగా నిమజ్జనానికి బయలుదేరాయి. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కొత్తగూడెం పుర ప్రముఖులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin