Sunday, 26 July 2026 11:46:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సారపాక బసప్ప క్యాంపులో బ్యాంకు లోన్ డబ్బులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి బాధితుల దగ్గర డబ్బు వసూలు...

Date : 12 April 2023 01:21 AM Views : 734

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి 90000 నగదు బాధితులు వద్ద వసూలు చేసిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక బసప్ప క్యాంపులో చోటు చేసుకుంది బాధితుడు జమాల రావు విలేకరుల సమావేశం నిర్వహించి తెలిపిన వివరాల ప్రకారం సారపాకలో నివాసం ఉంటున్న సతీష్ అనే వ్యక్తి బ్యాంకు ద్వారా నాలుగు లక్షలు లోన్ ఇస్తానని మాయ మాటలు చెప్పి, నా వద్ద 90000 రూపాయలు వసూలు చేశాడు. అనంతరం రేపు మాపు అంటూ మాయమాటలు చెబుతు కాలం వెళ్లబుచ్చుకుంటూ వస్తున్నాడు తన మాయమాటలు గమనించి నా డబ్బులు నాకు ఇవ్వమని నిలదీయడంతో కుటుంబంతో సహా ప్రస్తుతం సారపాక వదిలి మణుగూరులో నివాసం ఉంటున్నట్టు సమాచారం డ్రైవర్ గా పని చేస్తూ రెక్కాడితే గాని డొక్కాడని నా కుటుంబ పరిస్థితినీ ఆసరాగా చేసుకొని మాయ మాటలు నమ్మబలికిన సదరు వ్యక్తి నుండి నా డబ్బులు నాకు ఇప్పించగలరని బాధితుడు లబోదిబోమంటున్నాడు... ఎంతోమంది అమాయకులను లక్ష్యం చేసి మాయ మాటలు చెప్పి డబ్బులు మోసం చేసే కేటుగాళ్లు ఇటీవల కాలంలో అధికంగా కనిపిస్తున్నారు ప్రస్తుత కాలంలో పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట ఇటువంటి సంఘటనలు నరావృతం అవుతున్నాయి. పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అమాయకులనే లక్ష్యంగా మాయ మాటలు నమ్మబలికి డబ్బులు కాజేసి ఇటువంటి కేటుగాళ్లు తమ పబ్బం గడుపుతున్నారు ఇటువంటి వారిపై తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: