సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ములుగు జిల్లా, సర్కార్ టీవీ ప్రతినిధి నాగరాజు : ములుగు జిల్లా చిరుత పల్లి గ్రామంలో నకిలీ మొక్క జొన్న విత్తనాలు సరఫరా చేసిన సింజెంట, Bayer, CP , హైటెక్ బహుళ జాతీయ కంపెనీలు దళారీలు గోడ వర్తి నరసింహ మూర్తి ముడుంబా శ్రీనివాస్ రైతులను మోసం చేశారనే ఫిర్యాదు పై ST సెల్ సభ్యులు హుస్సేన్ నాయక్ గ్రామాన్ని సందర్శించారు. రైతులను నిండా ముంచిన బహుళ జాతీయ కంపెనీల సంస్థల ప్రతినిధుల పై పీడీ యాక్టు కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు, పిట్టా శ్రీనివాసరెడ్డి సుప్రీం కోర్టు న్యాయవాది తెలిపారు. చట్ట ప్రకారం 10 లక్షలు ఇన్స్యూరెన్స్ ఎకరాకు రైతులకు డైరెక్టు గా నిధులు విడుదల చేసి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. గోడ వర్తి నరసింహ మూర్తి ముడుంబా శ్రీనివాస్ రైతులను బెదిరిస్తున్నారని వారు కోట్ల రూపాయలు నిధులు దోచు కొన్నారు అని పిట్టా శ్రీనివాసరెడ్డి నేషనల్ ST కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ గారికి విన్నవించారు. జాతీయ ST కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ గారు చిరుత పల్లి గ్రామంలో పర్యటించి బాధితులను రైతులను చనిపోయిన కుటుంబసభ్యులు ను ఓదార్చి ధైర్యం చెప్పి, బాధ్యులపై pd యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు తరలి స్తామని. ఇన్సూరెన్ నష్ట పరిహారం చెల్లించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గో డ వర్తి నరసింహ మూర్తి, ముడుంబా శ్రీనివాస్ ల పై PD ACT కేసు నమోదు చేస్తామని భరోసా కల్పించారు. ఇట్టి విషయంలో న్యాయవాది నాగరాజు గ్రామస్తులకు అండదండగా ఉన్నారు... పిట్టా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ 18 వ తేదీ మార్చి నెలలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు బహుళ జాతీయ కంపెనీల, దళారీలు రైతులను మోసం చేస్తే వారిపై పీడీ యాక్టు కేసు లు నమోదు చేసి జైలుకు తరలించే చర్యలు తీసుకుంటునారా...? లేదా...? అని పిట్టా శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశం లో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు,జిల్లా కలెక్టర్ దివాకర్, ఐటిడిఎ పీఓ ఏటూరు నాగారం, RDO venkatesh, agricultural ఆఫీసర్ సురేష్ బాబు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్న రు....
-----------------------
Admin