సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు పారిశుధ్యం, పచ్చదనం పెంపొందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారాని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పట్టణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..... ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా భారీగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కోదాడ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కోదాడ మున్సిపాలిటీలో కోట్లతో పెద్ద చెరువు సుందరికరణ, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలెట్లు, మెగా పార్కులు, ఓపెన్ జిమ్‌లు, సెంట్రల్ లైటింగ్ తదితర నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గారి ఆశీస్సులతో కోదాడ అభివృద్ధికి మరిన్ని ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కోదాడ మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందు వరుసలో నిలపడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పట్టణాల సమగ్రాభివృద్ధి కావడం జరిగింది అని ఆయన అన్నారు.ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది అని ఆయన తెలిపారు.పట్టణాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన "పట్టణ ప్రగతి"లో భాగంగా చేపడుతున్న పలు వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రంలోని పట్టణాలలో అభివృద్ధి జోరందుకుంది అని ఆయన అన్నారు.పట్టణాలు దేశంలోనే అత్యంత నివాసయోగ్య ప్రాంతాలుగా రూపొందుతున్నవి అని ఆయన అన్నారు.భారీ సంఖ్యలో జాతీయ అవార్డులు పొందిన తెలంగాణ పురపాలికలు అని ఆయన అన్నారు.పట్టణ ప్రగతి లాంటి పథకాలు దేశంలో ఎక్కడ లేవు అని ఆయన తెలిపారు.60 ఏళ్ల ఉమ్మడి పాలనలో మన ప్రాంతం అభివృద్ధి జరగక వెనుకబడిపోయింది అని ఆయన ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ గారు ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకి అందాలని సంస్కరణలు చేపట్టారు అని ఆయన అన్నారు.ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం మన బి అర్ ఎస్ పార్టీ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది అని ఆయన అన్నారు.అనంతరం కోదాడకు చెందిన 33 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 96 గజాల చొప్పున ఇండ్ల పట్టాలని పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలకు గుర్తింపుగా వారందరినీ ఘనంగా శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, అధికారులు, పట్టణ కౌన్సిలర్లు, పాల్గొన్నారు.
-----------------------
Admin