Monday, 27 July 2026 12:36:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ మున్సిపాలిటీకి శఠగోపం పెడుతున్న వ్యాపార వాణిజ్య సంస్థలు...

Date : 26 January 2024 09:07 AM Views : 322

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మున్సిపల్ కేంద్రంలో పన్నులు చెల్లించకుండా శఠగోపం పెడుతున్న పలు వ్యాపార కేంద్రాలకు సంబంధించి అనుమతులు లేకపోగా కనీసం ట్రేడ్‌ లైసెన్స్‌ల కోసం వారు దరఖాస్తు చేసుకున్న దాఖలాలు కూడా లేవు. ప్రధాన వాణిజ్య వ్యాపార కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్న హుజూర్ నగర్ పట్టణంలో బడా వ్యాపారులు పన్నులను భారీగా ఎగవేస్తున్నారు. నిత్యం లక్షల్లో వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులు మున్సిపల్‌ శాఖకు చెల్లించాల్సిన పన్నులను ఎంతమాత్రం కట్టకుండా మొండి కేస్తున్నారు.ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోకుండా తమ వ్యాపారాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మున్సిపల్‌ శాఖకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న వ్యాపారవర్గాలు చిల్లిగవ్వ కట్టకుండా తమ దందాను దర్జాగా కొనసాగిస్తున్నా పన్నులు వసూలు చేయాల్సిన మున్సిపల్‌ శాఖ క్రింది అధికారులు మామూళ్ల కు అలవాటు పడి అటు వైపు కన్నెత్తి చూడడంలేదు. సామాన్యుల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్‌ అధికారులు సిబ్బంది వ్యాపారుల నుంచి ఎందుకు పన్ను వసూలు చేయడం లేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఎందుకీ ఈ ఉదాసీనత?. వ్యాపారులతో అధికారులు,పాలకులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. అందుకనే వారికి కనీసంగా ట్రేడ్‌ లైసెన్స్‌లు ఇచ్చే ధైర్యం చేయడంలేదు.కనీసంగా నోటీసులు కూడా జారీ చేయడం లేదంటే పరిస్థితిని ఊహించవచ్చు. పాలకులు వారికి వంతపాడుతూ మున్సిపల్‌ శాఖకు రావాల్సిన ఆదాయం వసూళ్లకు అడ్డు తగులుతున్నట్లు సమాచారం. ఇక అధికారులు సైతం అంతో ఇంతో పుచ్చుకుని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులే లేవు హుజూర్ నగర్ పట్టణ పరిధిలో ఏర్పాటవుతున్న వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు మున్సిపల్‌ శాఖ నుంచి అసలు ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు.167వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి హోటళ్లు, దాబాలు, మార్బుల్‌, స్టీల్‌, సిమెంట్‌ వ్యాపారాలతో పాటు పట్టణ కేంద్రంలో ప్రైవేట్ ఆస్పత్రులు వాటి అనుబంధ అనధికార పరీక్ష కేంద్రాలు(ల్యాబ్స్), మెడికల్ షాప్స్,లాడ్జీలు తదితర వ్యాపార కేంద్రాలకు సంబందించిన అనుమతులు లేవు నిబంధనలను పట్టించుకోవడం లేదు.అంతేగాక ఆయా నిర్మాణాలకు సంబంధించి రక్షణ చర్యలను కూడా విస్మరిస్తున్నారు. తమ ఇష్టానుసారంగా నిర్మాణాలను చేపట్టి వాటిలో తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నా సంబంధిత అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే తప్ప చర్యలకు దిగడం లేదు. వ్యాపారుల నుంచి ఆదాయం లభించకపోవడంతో మున్సిపల్‌ శాఖ ఏటా లక్షల రూపాయలు నష్టపోతోంది వ్యాపారులు ఎలాంటి పన్ను చెల్లించకుండా, లైసెన్స్‌లు సైతం తీసుకోకుండా మున్సిపల్‌ శాఖకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రధానంగా భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో కొనసాగుతున్న సూపర్‌ మార్కెట్‌లు, ఎంటర్‌ప్రైజెస్‌లు, వస్త్ర దుకాణాలు, హోటళ్లు, మార్బుల్‌, టైల్స్‌, సిమెంట్‌, స్టీల్‌, ప్రైవేట్ ఆస్పత్రులు తదితర భారీ వ్యాపార వాణిజ్య కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పన్నులు చెల్లించకుండా వ్యవహరిస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం సామాన్య ప్రజల నుంచి నిక్కచ్చిగా పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్‌ అధికారులు, వ్యాపారుల నుంచి ఎందుకు వసూలు చేయడంలేదు. ప్రతి సంవత్సరం లక్షల రూపాయల ఆదాయం కోల్పోతూ వ్యాపారుల కొమ్ము కాయడంలో ఆంతర్యం అర్థం కావడం లేదు. పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయమా? ఇప్పటికై నా పన్నుల ఎగవేత దారులకు భారీ జరిమానా విధించి వసూలు చేయాలి. ఆదివారం నాడు పండగ పండగల పూట యదేచ్చగా రహదారుల వెంబడి మటన్ షాపులు నడిపిస్తున్న వాటిని కనీసం నెలకొకసారైనా పరిశీలించిన దాఖలాలు లేవు టిఫిన్ సెంటర్లు కానీ భోజన హోటల్ గాని బిర్యానీ పాయింట్ లు గాని ప్రతి రోజు వేళలో వ్యాపారం చేస్తున్న కనీసం ఒక్కరోజులో ఒక్క షాపు నైనా పరిశీలించిన దాఖలాలు లేవు ఇది కమిషనర్ బాధ్యత కాదా కాసులకు కకృతి పడి చూసి చూడనట్టు ఉంటున్నారా రోడ్ల వెంబడి మటన్ షాపులలో దుమ్ము ధూళి పడి సుశీ శుభ్రతలేని మాసాన్ని తిని ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ ఇట్టి విషయమై హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ ను సంప్రదించగా మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం చేస్తున్న వారు విధిగా ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలని పన్ను ఎగవేత దారులకు నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని లేనియెడల వారిపై వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: