సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట సర్కార్ న్యూస్ శ్రీ ఆదర్శవాణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నల్లబెల్లి మండలం నల్లబెల్లి బ్రాంచ్ శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ మరియు దసరా వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి గారు మాట్లాడుతూ భాద్రపద మాసంలోని అమావాస్య రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి వరకు కొనసాగుతాయి ఇప్పుడు బతుకమ్మ పండుగ దేశవ్యాప్తంగా ప్రతి ఆడపడుచు తిరొక్క పువ్వులతో చేసుకునే పండుగ గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేవారు ఈ సందర్భంగా ప్రకృతిలోని ఆరాధించే అందమైన పండుగ బతుకమ్మ ఈ పండుగ సందర్భంగా ఆడబిడ్డలు పూలను పూజించడం గొప్ప సాంప్రదాయం ఇది ఒక తెలంగాణకు మాత్రమే సొంతం తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని సూచించే పూల వేడుక బతుకమ్మ పండుగ ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా పిల్లలకు సాంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పాటు కొరకు పాఠశాలలో రావణాసుర వద రాక్షస వధ ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బత్తిని కవితా బిక్షపతి ప్రిన్సిపాల్ మాడిశెట్టి సుధాకర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Reporter