సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో ధనలక్ష్మి కాలనీలో సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ధనలక్ష్మి కాలనీని గ్రామ కంఠంలో విలీనం చేసి తొమ్మిది, పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఆ కాలనీ సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా కాలనీలోని రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయని, డ్రైనేజీలు లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షకాలం వచ్చిందంటే చాలు రోడ్లపై తిరుగలేని పరిస్థితి ఉందని వెంటనే తమ కాలనీలో సమస్యలు పరిష్కరించి సీసీ రోడ్లు, డ్రైనేజీ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు స్పదించి రోడ్లు బాగుచేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
-----------------------
Admin