సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరి పాలనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పాలనకు తొంభై శాతం వ్యత్యాసం ఉన్నదనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పనిచేసిన ముఖ్యమంత్ర్రులు అందరు కలిపి చేసిన అప్పుల కన్నా మిగులు బడ్జెట్ తో బాధ్యతలు ప్రజలు అప్పజెప్పితే తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అప్పులు మూడు రెట్లు ఎక్కువగా చేశారనీ కానీ ఆచరణలో అభివృద్ధి మాత్రం కంటికి కనబడనంత దూరంలో ఉన్నదనీ , రాబోయే రోజుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుటయే గాక పేదలకు , ధనికులకు మధ్య ఆకలి పోరాటాలు, దారిదోపిడీలు జరిగే అవకాశం ఉందని దానికి , తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యులనీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామ మాత్రపు ఉచిత పథకాలతో , గారడీ మాటలతో ప్రజలను గుడ్డిగా నమ్మించారనీ , రాబోయే కాలంలో అట్టి పథకాలకు నిధులు లేక రాబోయే రోజుల్లో కాబోయే ప్రభుత్వాలు వాటిని ఎత్తివేస్తే ఉచితాలకు అలవాటు పడిన ప్రజల జీవనశైలి అగమ్యగోచరంగా మారుతోందని , ప్రజలకు శాశ్వత ఉపాధి మార్గాలను చూపాల్సిన ప్రభుత్వాలు వారి పదవీ కాంక్షతో అమలుగాని వాగ్దానాలు చేసి , రాష్ట్ర ఖజానా దివాలా తీయించి అప్పుల పాలు చేశారని వారు ఆవేధన వ్యక్తం చేశారు . గత పాలకులు ఎదేనీ నూతన చట్టం అమలు చేసే సందర్భంలో అన్ని పార్టీల సలహాలు , సూచనలు తీసుకునేవారని , కానీ కేసీఆర్ పాలన రాజరిక పాలన వలే చేసి నిరుద్యోగుల , యువత భవిష్యత్తు నాశనం చేశారని , ప్రజలు బంగారు తెలంగాణ అంటే ఎలాగుంటదో అని ఆశతో ఎదురు చూస్తే , బాధల తెలంగాణ గా తయారుచేశారనీ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు , టిఆర్ఎస్ పార్టీ ఉండదనీ వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాలకవీడు మండల పార్టీ అధ్యక్షుడు కొనకంచి సైదులు , పార్టీ కార్యదర్శి నెమ్మాది సుందరయ్య , షేక్ సత్తార్ , నల్లమేకల యలమంద పాల్గొన్నారు.
-----------------------
Admin