సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండల కేంద్రం లో ఎస్ సి కాలనీకీ చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన సత్తరపు వీరయ్య గారు రోడ్డు ప్రమాదం లో గత వారం చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యుల కి రఘు అన్న చేయూత ద్వార 5000/- ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న చేతుల మీదుగా వారి కుమారుడు సత్తారపు రాంబాబు కి వివ్వడం జరిగింది నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులు సుధాకర్, సాయిబాబా, మెస్సీ,ఫోన్ ద్వారా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న కు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబనికి ఓజో ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేసారు కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు అన్న చేయుతా ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నరు మన మఠం పల్లి మండల కేంద్రంలో రఘు శ్రీ కోదండ రామ స్వామి కళ్యాణ మండపం నిర్మాణం వినాయక విగ్రలు, అమ్మవారి విగ్రహాలూ వివ్వడం గాని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది, గురుకుల పాఠశాలలో డ్రైనేజీ సిస్టమ్ మార్చడం, మోడల్ స్కూల్ లో గ్రౌండ్ డెవలప్మెంట్ , యూ పి ఎస్ స్కూల్ కి రంగులు వేపించడం, బతుకమ్మ పండుగ సందర్భంగా బహుమతులు వివ్వడం క్రీడాకారులను ప్రోత్సహించడానికి కబడ్డీ పోటీలు నిర్వహించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క మఠం పల్లి మండల కేంద్రము లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు, రఘు లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో అన్నగారికి ఒక అవకాశం వివ్వాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో యాసరపు సుధాకర్, వీరాస్వామి, పిల్లుట్ల సాయిబాబా,పొట్ట బాబు , ఆరాల అంజి, సైదులు, మెస్సి,అన్వర్, పెండెం వినయ్ గౌడ్, రాంబాబు,గ్రమ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin