Monday, 27 July 2026 02:35:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసమే చంద్రబాబు అరెస్ట్...

Date : 10 September 2023 09:07 AM Views : 153

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. చంద్రబాబు నాయుడు ను అర్ధరాత్రి అక్రమ అరెస్టు చేయడంపై హుజూర్ నగర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెంటర్లో ధర్నా, పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసమే ఏపీ సిఐడి పోలీసులు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారని విమర్శించారు. ఆర్థిక నేరాలలో చిక్కుకొని 16 నెలలు చిప్పకూడుతున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును జైలు పాలు చేయాలనే నేపంతో కుట్రలకు తెర లేపారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలలో విశ్వాసం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, దౌర్జన్యం ,అక్రమ అరెస్టులతో పాలన కొనసాగిస్తున్న విషయం యావత్ ప్రజానీకం గమనిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు చంద్రబాబునాయుడు గారి పై విశ్వాసం, తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని ,జగన్మోహన్ రెడ్డి జరగబోయే ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో అరెస్టులకు పురమాయిస్తున్నాడని విమర్శించారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ,అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో *హుజూర్ నగర్ పట్టణ పార్టీ అధ్యక్షులు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్, గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు కీసరి నాగయ్య ముదిరాజ్, టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోష పతి హుజూర్ నగర్ మండల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కస్తాల కనక రత్నం ,తురక గోపి మేళ్లచెరువు మండల పార్టీ అధ్యక్షులు చిన్న పంగు నాగరాజు, హుజూర్ నగర్ గౌరవ అధ్యక్షులు తమ్మిశెట్టి రాములు, బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వంశీ , ఎస్టీ సెల్ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి బానోతు లక్ష్మ నాయక్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూక్య బాలాజీ నాయక్ , కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు చీకూరి గోవిందరాజు , హుజూర్ నగర్ పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రగిరి సాంబ, హుజూర్ నగర్ పట్టణ పార్టీ కార్యదర్శి వల్లపు దాసు కోటయ్య గౌడ్, గరిడేపల్లి మండల బిసి సెల్ అధ్యక్షులు బుర్ర కోటయ్య, మధు చౌదరి ,,టిఎన్టియుసి నాయకులు కీసరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :