సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజబాబు విజయం సాధించారు.ఆమె తన సమీప బిఆర్ఎస్ ప్రత్యర్థి పై 48 ఓట్ల మెజార్టీ తో ఘన విజయం సాధించారు ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ విజయంలో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా దేశాయిపల్లి శంబాయపల్లి రాజకీయాల్లో కాంగ్రెస్ బలాన్ని చాటే ఫలితంగా మారిందని స్థానిక నేతలు పేర్కొన్నారు కాంగ్రెస్ శ్రేణులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
-----------------------
Reporter