సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జెఏసి వైస్ చైర్మన్ కడారి సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం కార్యక్రమంలో బీసీ జెఏసి వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేయకుండా సర్పంచ్ ల ఎన్నికలకు వెళ్లడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బిసి జెఏసి కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే ఏ ఎన్నికల నైనా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలకు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. జిఓ 46 తో బీసీ లను రాజకీయ సమాధి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జిఓ నెంబర్ 9 విడుదల చేసిన ప్రభుత్వంమే ఇప్పుడు జీవో నెంబర్ 46 ను విడుదల చేసి బీసీలకు ద్రోహం చేసిందని జీవో నెంబర్ 46 ను రద్దు చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం పై బీసీల పోరాటం ఆగదని బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 46 ను తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు చీకటి ఒప్పందం తోనే ఆగ మేఘాలతో జీవో నెంబర్ 46 తీసుకొచ్చిందని తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం రెడ్లను సర్పంచులుగా చేయడానికి అగ్రకుల నాయకులు బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసే సందర్భంలో రెండు పార్టీలు ఇప్పుడు మాట మార్చి బీసీలకు ద్రోహాన్ని తలపెడుతున్నాయని సర్పంచులను సైతం రాష్ట్రంలో అగ్రకులాలకే కట్ట పెట్టాలనే కుట్రతోనే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న బీసీలకు పోరాటాలు లేని కొత్త కాదని సాధించేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను రద్దుచేసి రేపు జరగబోయే పార్లమెంటు శీతాకాల సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై పోరాడాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో భాగంగా బీసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారని అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ పవర్ రాష్ట్ర అధ్యక్షులు ఆబోతు రాజు యాదవ్, బీసీ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముంజాల రాజేందర్ గౌడ్, బిసి జేఏసీ వైస్ చైర్మన్ కడారి సురేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు విద్యాసాగర్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, నర్సంపేట మండల నాయకులు మారపాక రమేష్ ముదిరాజ్, దుగ్గొండి మండల నాయకులు దండు రాంబాబు ముదిరాజ్, కొలిపాక సుధాకర్, గౌరవ అధ్యక్షులు రామగిరి యాదగిరి స్వామి, బీసీ పవర్ రాష్ట్ర అధికార ప్రతినిధి మచ్చిక రాజు గౌడ్, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ మండల కన్వీనర్ సంఘాల శివ, బీసీ పవర్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు సంగినేని లకన్ ముదిరాజ్, జిల్లా కోఆర్డినేటర్ సునీల్, బీసీ నాయకులు శీరంశెట్టి రాజేందర్ పెరక, మద్దెల కొమురయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter