సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, మోడీ తెలంగాణ పర్యటన నిరసిస్తూ, వరంగల్ లో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు బయ్యారం స్టీల్ ప్లాంట్, మైనింగ్ యూనివర్సిటీలు, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు, ఐఐఎం, మరియు ఐఐటి లు తెలంగాణలో వెంటనే నెలకొల్పాలని అన్నారు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణి,బ్యాంకులు, ఎల్ ఐ సీ లు,మరియు ఉక్కురక్షణ, తదితర రంగాలను ప్రైవేటుపరం చేసే చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం సిబిఐ,ఈడి, ఎలక్షన్ కమిషన్ మొదలకు సంస్థలను తమ స్వార్థానికి ఉపయోగించుకుంటుందని, ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ సందర్భంగా అన్యాయంగా అరెస్టు చేసిన కామ్రేడ్ కూనంనేని సాంబశివరావుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-----------------------
Admin