సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / నేటి సమాజంలొ పర్యావరణకు పరిరక్షణ ఎంతో ముఖ్యమని దానికోసం మొక్కలను విరివిగా నాటాలని రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి శిరీష తెలిపారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలు ఆధ్వర్యంలో ఆమె కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ హరితోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె మొక్కలు నాటినట్టు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆమె సోమవారం కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారి ఆమెను హరితోత్సవ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేయగా అందుకు న్యాయమూర్తి శిరీష ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మొక్కల ఆవశ్యకత గురించి పర్యావరణ పరిరక్షణ గురించి అక్కడ ప్రజలకు వివరించారు.
-----------------------
Admin