సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి నియోజకవర్గం, శాయంపేట మండలం, పెద్దకోడేపాక గ్రామ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన కోగిల కళ్యాణి సదానందం మరియు గ్రామశాఖ ముఖ్య నాయకులు ఈ రోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కోగిల సంపత్ కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన కళ్యాణి సదానందం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు..
-----------------------
Reporter