సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్: పట్టణంలోని ఒక ప్రయివేట్ హిస్పిటల్ లో 12సంవత్సరాల బాబుకి ఏ పాజిటివ్ రక్తం తక్కువగా ఉంది అత్యవసరంగా కావాలి అని వినయ్ జనచైతన్య ట్రస్ట్ నిర్వాహకులు అయినా పి.వంశీ, పారా.సాయి, పిల్లి.శివశంకర్ లకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి జనచైతన్య ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి. శివశంకర్ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ బి. కిషోర్ తో మాట్లాడి హాస్పిటల్ వద్దకు పంపించి,రక్తదానం చేపించడం జరిగింది. ఈ సందర్బంగా ట్రస్ట్ ఉపాధ్యక్షులు పిల్లి.శివశంకర్ మాట్లాడుతూ రక్తదానం అనేది చాలా గొప్ప పని ఎందుకంటే మనం రక్తాన్ని సృష్టించలేం దానం మాత్రమే చేయగలం ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండు మూడు సార్లు రక్తదానం చేయొచ్చు మీరు చేస్తున్న రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది ఈరోజు రక్తదానం చేసిన నా మిత్రుడు కిషోర్ కి హృదయ పూర్వక అభినందనలు. రక్తదానానికి కులం లేదు రక్తదానానికి మతం లేదు అదేవిదంగా ప్రజలకు,యువతకు రక్తదానం చేయడం పట్ల ఇంకా అవగాహన కల్పిస్తూ, ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతాం అన్నారు.
-----------------------
Admin