సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలోని మేదర బస్తి లో జాతీయ ఓటర్ దినోత్సవం వేడుకలు... జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మేదర్ బస్తిలోని 19 వ వార్డు లోగల ప్రభుత్వ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కును అవగాహన కల్పించారు చిన్నారులతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ బండి నరసింహారావు,20 వ వార్డు కౌన్సిలర్ సుజాత, 21వ వార్డు కౌన్సిలర్ మాదా సత్యవతి,22వ వార్డు కౌన్సిలర్ జయంతి మసూద్, మరియు పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వల్లి మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ బండి నరసింహరావు మాట్లాడుతూ ఓటు హక్కును అందరు వినియోగించుకోవాలని రాబోయే తరాలకు మీ ఓటు తో బంగారు భవిషత్తు ఇవ్వాలని బ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థను నేటి యువతరం ఓటుతో సమాధానం చెప్పాలని ఎంతో గొప్ప ఆయుధమైన ఓటును వృధా చేసుకోవద్దని అన్నారు. తదనంతరం పోటీలో పాల్గొన్న విద్యార్థులకు హాట్ బాక్స్ లు, పెన్నులు, నోట్ బుక్స్ అందించడం జరిగింది.
-----------------------
Admin