సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం కేంద్రంలోని స్థానిక జడ్పీ హైస్కూల్ నందు బుధవారం ఆర్.బి.ఐ ఆదేశాల మేరకు ఓ డి చెరువు స్టేట్ బ్యాంకు బ్యాంకు అధికారుల సహకారంతో 8, 9,10తరగతి విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రాం నిర్వహించినట్లు మండల విద్యాధికారి ఖాదర్ వలి బాషా తెలిపారు. ఎం ఈ ఓ 1, ఎం ఈ ఓ 2 అధికారుల పర్యవేక్షణలో ఈ పోటీ పరీక్షల నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఓ డి సి జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్ అశ్విని మొదటి బహుమతి, రెండవ బహుమతి గౌనిపల్లి జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థి గణేష్, కొండకమర్ల జెడ్పిహెచ్ఎస్ విద్యార్థి ఎన్ కార్తీక్ మూడో బహుమతి గెలుపొందగా వారికి ఖాదర్ వలి బాషా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ భాస్కర్ రెడ్డి,ఓబులదేవర చెరువు స్టేట్ బ్యాంకు అధికారి, విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin