సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి 5 వార్డులో గడప గడప కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాల్ రావు, తూము చౌదరి మాట్లాడుతూ తెలంగాణ వనరులను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుంది అన్నారు. టీఆర్ఎస్ పాలనలో గల్లీకో బెల్ట్ షాపు తప్ప జరిగిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ప్రస్తుతం హడావుడిగా మొదలు పెట్టిన అభివృద్ధి పనులన్నీ కమిషన్ ల కోసం తీసుకున్నవని అన్నారు. సామాన్య కార్యకర్తను ప్రధాన మంత్రిని చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీ దేనని, గౌరవం దక్కాలి అన్న, ప్రజా సేవ చేయాలన్న కాంగ్రెస్ పార్టీ ఒక సరైన వేదిక అన్నారు. బిఆర్ఎస్ పాలనలో పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబంనికి, కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా కుటుంబ సభ్యులకు మరియు వారి అనుచరులకు తప్ప పేదవాడికి లాభం ఏమి లేదన్నారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తద్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, అర్హులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు,పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక చేయూత, మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, 500/-రూపాయలకే గ్యాస్ సిలిండర్, చదువుకుంటున్న 18 సంవత్సరాల బాలికలకు ఉచిత స్కూటీ మరియు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ లోని అంశాలను పూర్తిగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అయూబ్ ఖాన్, ప్రసాద్, చిమట నాగేశ్వరరావు, సతీష్, ఉదయ్ కుమార్, ఎండి గౌస్, శేఖర్, ఖలీల్, ఉమర్, 5 వార్డు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin