సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలంలోని స్థానిక పల్లవి మండల సమాఖ్య డిఆర్డిఏ వెలుగు కార్యాలయం నందు మంగళవారం మండల సమాఖ్య కార్యవర్గ సమావేశము జరిగింది. ఈ సమావేశానికి ప్రాజెక్టు డైరెక్టర్ కే. ఎన్. నరసయ్య, ఎల్ డి ఎం. రమణ మూర్తి, ఏరియా కోఆర్డినేటర్ రామ్మోహన హాజరయ్యారు. ప్రాజెక్టు డైరెక్టర్ కే. ఎన్. నరసయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామ సంఘం ఆదర్శ గ్రామ సంఘముగా వుండేలా తీర్చి దిద్దాలని, 100% అన్ని రకాల అప్పులు రికవరీ చేసి పంపాలన్నారు. గ్రామ సంఘాల ఆదాయాలు పెంచుకోవాలి. గ్రామ సంఘం వారిగా,సిబ్బంది వారిగా ప్రాజెక్టు అంశాలపై సమీక్ష చేశారు. ఎల్ డి ఎం.రమణ మూర్తి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా తీసుకొన్న రుణాలను 100% సద్వినియోగం చేసుకోవాలని, మైక్రో ఎంటర్ ప్రైజెస్ కొరకు తీసుకొన్న రుణాలను వినియోగించాలని తెలిపారు. అలాగే 100% రికవరీ చేయాలని కోరారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఓబుల దేవర చెరువు బ్యాంక్ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎస్ హెచ్ జి సభ్యులకు పిఎంఈజి పి స్కీం ద్వారా మైక్రో ఎంటర్ ప్రైసెస్ కొరకు 1లక్ష రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏరియా కోఆర్డినేటర్ రామ్మోహన, మండల సమాఖ్య ఈసీ సభ్యులు, మండల సమాఖ్య లీడర్లు,ఎల్ సి సి సి, ఎఫ్ పి ఓ, సి సి, క్లస్టర్ సి సిలు, స్త్రీ నిధి మేనేజర్, ఎం ఎస్ ఏ, హాజరయ్యారు.
-----------------------
Admin