Sunday, 26 July 2026 02:37:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం...

Date : 09 January 2023 12:03 AM Views : 637

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ &, పినపాక శాసనసభ్యుడు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుంచి సుమారు 400 కుటుంబాలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై BRS పార్టీలో చేరారు, వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆహ్వానించారు, అనంతరం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ BRS ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలుకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు BRS పార్టీలో చేరుతున్నారని అన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు, సీఎం కేసీఆర్ నిత్యం పేద ప్రజల రైతుల బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన ఇంతటి అభివృద్ధి, ఇలాంటి పరిపాలన చేసిన సీఎం ఎవరు లేరని ప్రజలు గ్రహించి సీఎం కేసీఆర్ చేసే అభివృద్ధికి ప్రజల ఆనందాన్ని తెలుపుతున్నారు, ఎవరికి సాధ్యం కానీ సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణ అభివృద్ధి బాటలతో పయనిస్తున్న తెలంగాణను సీఎం కేసిఆర్ తో సాధ్యమవుతుందని అన్నారు, పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు, ప్రతి కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు,BRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు పట్టణాలు రూపురేఖలు మారిపోయాయని ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని అన్నారు,కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని, మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. BRS ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,116/- రూపాయల ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అని అన్నారు, జనవరి 18 నుండి రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్నది అన్నారు, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు సమావేశాలు నిర్వహించి సమన్వయంగా పనిచేయాలన్నారు , కంటి వెలుగులు అందిస్తున్న అద్దాలు కూడా చాలా బాగున్నాయని అవసరంఉన్న వారందరికీ అద్దాలు అందేలా కృషి చేయాలన్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు, మను ఊరు మనబడి కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తున్నదని అన్నారు, గత పాలకవర్గాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలరక్షణ పోయాయి అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగా రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు, రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి వర్గాల పిల్లలను ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుంది అన్నారు, గ్రామస్తులు పాఠశాల అభివృద్ధిలో భాగ్యస్వామ్యులు కావాలన్నారు, తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాల చేర్చించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు, మన ఊరు మనబడి ద్వారా 7281 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వివిధ రకాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నయి అన్నారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా 100 కోట్లు ఇచ్చారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండలం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :