Sunday, 26 July 2026 05:22:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ ఖరారు...

Date : 02 May 2023 09:00 AM Views : 579

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ఈ నెల 8వ తేదీన ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు రానున్నట్లుగా సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రియాంక గాంధీ సరూర్ నగర్‌లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే, ప్రియాంక గాంధీ ఈ నెల 5వ తేదీనే తెలంగాణకు వస్తారని ఇటీవల టీ- కాంగ్రెస్ తెలిపింది. ప్రియాంక గాంధీ ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన షెడ్యూల్‌ను మార్చింది. ఏఐసీసీ మార్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదీన ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై సమరభేరి మోగించడం ద్వారా యువతను కాంగ్రెస్‌ వైపు తిప్పుకునేందుకు పీసీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు చెందిన ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడంపై.. కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. వర్షిటీల్లో నిరుద్యోగ నిరసన దీక్ష సభలు ఏర్పాటు చేయాలని పీసీసీ ప్లాన్ చేసింది. ఇదిలావుంటే, అర్ధాంతరంగా నిలిచిపోయిన పాదయాత్రను తిరిగి మొదలు పెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రెడీ అవుతున్నారు. మే 9వ తేదీ నుంచి రెండో విడత “హాథ్‌ సే హాథ్‌ జోడో” యాత్రను 32 నియోజక వర్గాల్లో నిర్వహిస్తామన్నారు. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :