సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువులోపాత్రికేయులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ నాలుగు రోజులుగా స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా పాత్రికేయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గురువారం పాత్రికేయుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ మండల కార్యదర్శి మేకల ఈశ్వర్ తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు ప్రభుత్వ పథకాలు ఇతర అంశాలపై ప్రభుత్వాలకు ప్రజలకు వారధులుగా పనిచేస్తున్న విలేకరులకు న్యాయమైన కోరికలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తక్షణమే అధికారులు, పాలకులు స్పందించి విలేకరులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాత్రికేయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జనసేన పార్టీ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, ఓ డి సి మండల కన్వీనర్ మేకల ఈశ్వర్, నల్లమాడ ప్రెసిడెంట్ మహేష్,రహమతుల్లా ,లక్ష్మీపతి, ఆంజనేయులు, చలపతి ,ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin