సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని మాజీ పార్లమెంటు సభ్యులు వి హెచ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రబీ సీజన్ ముగుస్తున్నప్పటికీ ఎక్కడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని అన్నారు. అకాల వర్షాలతో రైతులకు పంట ఉత్పత్తులు నిల్వచేసుడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చేతికొచ్చిన పంట అకాల వర్షాలతో దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.నిరుద్యోగులను, రైతులను కేసీఆర్ నిలువునా మోసం చేస్తున్నారని మండి పడ్డారు.రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటదని అన్నారు. దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యలపై కొట్లడుతున్నరాని అన్నారు. అందుకే వారిపై లేని పోని అవాకులు చెవాకులు పేలి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి అధికారం వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్నారని అన్నారు. ఇది ప్రశ్నించినందుకు రాహుల్ పై అనర్హత వేటు వేసి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించారని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చి యెనిమిది ఏండ్లు అవుతున్న ఇంతవరకు ఓబీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. మోడీ కి తన బీనామిల పై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై లేదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ మోడీ తోడు దొంగలని ఆయన దేశాన్ని, ఈయన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. ఇద్దరి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 24న జిల్లా కాంగ్రెస్ అధ్యార్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని దీనికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ ర్యాలిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం మాజీ మత్రి సంబాని చంద్రశేఖర్ మాట్లాడుతూ..పోరాటాల పురిటగడ్డ ఖమ్మం అని ఖమ్మం నుండి ఏ ఉద్యమం మొదలు పెట్టిన అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని అన్నారు. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుధ్యోగ పోరుబాట నిర్వహిస్తున్నామని ఈ ఉద్యమంతో అధికార పార్టీ వెన్నూల్లో వణుకు పుట్టించాలని అన్నారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయని అన్నారు.ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు 2500 నిరుద్యోగ భృతి కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు.అనంతరం జిల్లా , నగర కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ.. నిరుధ్యోగ నిరసన ర్యాలీ ని విజయవంతం చేయాలని మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు...
-----------------------
Admin