సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన మల్లు భట్టి విక్రమార్క 138వ పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మధిరలో కేక్ కట్ చేసి కార్యకర్తల మధ్యన సంబరాలను నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లు భట్టివిక్రమార్క ప్రెస్ మీట్ కామెంట్స్ 1885 లో ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీతోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది..... ఈ దేశ స్వాతంత్రం తో పాటు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను తొలిగించటానికి పోరాటం చేసి సాధించిన పార్టీ కాంగ్రెస్ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి డాక్టర్.బి. ఆర్.అంబేద్కర్ ఆధ్వర్యంలో రాత పూర్వకంగా రాజ్యంగాన్ని రూపొందించిన పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన భారత రాజ్యాంగం వల్ల దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడంతో పాటు ఎలాంటి హింస ఇబ్బంది లేకుండా సహజసిద్ధంగా అధికార మార్పిడి జరుగుతున్నది. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణం భారతదేశంతో పాటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పటిష్టంగా లేకపోవడంతో ఎన్నికలలో గెలిచిన ప్రభుత్వాలను అక్కడ ఆర్మీ కూలదోస్తున్నది. అనేకమార్లు ఆ దేశ అధ్యక్షులను అరెస్టులు చేసి నిర్బంధించడం ఉరి తీయడం, కాల్చి చంపడం లాంటి దుర్ఘటనలకు అక్కడి ప్రజాస్వామ్యం రాజ్యాంగం పటిష్టంగా లేకపోవడమే. సమాజంలో చర్చలు, శాంతియుత భావం ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి, అలాంటి మార్గాలను చూపెట్టి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ భారతదేశంలో నిర్వహించిన అనేక ఉద్యమాల్లో ఏ రోజు కూడా హింసను ప్రోత్సహించని ఏకైక పార్టీ కాంగ్రెస్. గణతంత్ర, స్వాతంత్ర, లౌకికవాద, సామ్యవాద, సర్వసత్తాక భారతదేశాన్ని రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకుని ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగించింది కాంగ్రెస్. అనేక మతాలు, కులాలు, రాష్ట్రలుగా ఉన్న ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరు కలిసి కట్టుగా ఉండే జీవన విధానాన్ని నిర్మించిన పార్టీ కాంగ్రెస్. ప్రపంచంలో యుద్ధాలు చేసుకుంటున్న దేశాలు మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గం, గాంధేయవాదం, శాంతి వైపు చూస్తున్నాయి మహాత్మాగాంధీ అనుసరించిన శాంతి, అహింస సిద్ధాంతంతోనే నేడు దేశాల మధ్య జరిగే యుద్దాలు శాంతియుతంగా పరిష్కారం అవుతున్నాయి... పేదలు అభివృద్ధి చెందటమే కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక విధానాలు, ప్లానింగ్ కమిషన్ తీసుకువచ్చి అభివృద్ధికి బాటలు వేసింది.
-----------------------
Admin