Monday, 27 July 2026 04:29:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ ను వెంటనే అరెస్టు చేయాలి... సూర్యాపేట జిల్లా పి.డి.ఎస్.యు

Date : 29 August 2024 12:35 AM Views : 542

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ ను వెంటనే అరెస్టు చేయాలి... కరీంనగర్ లో పి.డి.ఎస్.యు నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. - పి.డి.ఎస్.యు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా శ్రీ చైతన్య స్కూల్స్ ను నిర్వహిస్తూ, రాజ్యాంగేతర శక్తిగా వివరిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్ ను వెంటనే అరెస్టు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) డిమాండ్ చేసింది. ఈరోజు సూర్యాపేట శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సింహాద్రి మాట్లాడుతూ శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ అక్రమంగా విద్యా సంస్థలను నడుపుతున్నాడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనుమతులు లేకుండా పాఠశాలలు నడుపుతూ విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు. ఒకొక్క అడ్మిషన్ కు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ దానికి తగిన విధంగా సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. ఇటీవలే సిద్దిపేట చిన్నపిల్లలు ఉంటున్న హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు అనేక అవస్థలు పడ్డారన్నారు. అడ్మిషన్ ఫీజు మాత్రమే కాకుండా రవాణాపు, బుక్స్ , డ్రెస్ ల పేరుతో ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తూ ఫీజుల దందాను చేస్తున్నారన్నారు. విద్యాశాఖ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదులు చేసిన ఫలితం లేదన్నారు. ఖమ్మం నగరంలో అనేకమంది విద్యార్థులు శ్రీచైతన్య పాఠశాలల్లో చదివి, వారు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను మోసం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ, ఈడి, ఏసీబీ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ చేపించాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలన్నారు. కరీంనగర్ లో పి.డి.ఎస్.యు జిల్లా రాణా ప్రతాప్ , మరియు ఎనిమిది మంది విద్యార్థి నాయకులకు అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థలు మూతపడేంతవరకు పి.డి.ఎస్.యు చేస్తుందని దానికి దశలవారీగా ఉద్యమిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, నాయకులు, అభి, గోపి, మహేష్, నవీన్,పవన్, వినయ్, ప్రవీణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :