సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ నిజాంబాద్ జాతీయ రహదారి పక్కనున్న ఒక ఎకరం 30 గుంటల స్థలం లో మాల కమిటీ కళ్యాణమండపం ఆర్మూర్ ఎమ్మెల్యే బీ. ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు పియుసి చైర్మన్ ఆశన్న జీవన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఇట్టి కార్యక్రమం మాక్లూర్ మండల అధ్యక్షుడు మస్తా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాల కళ్యాణ మండపం కోసం కోటి రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు రాబోయే ఎన్నికల్లో నన్ను వినిపిస్తే మాల కళ్యాణ మండపంలో ఏసీ కళ్యాణం మండపం చేస్తానని చెప్పారు. మన మన ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఒక వంద 25 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిస్తా అని హామీ ఇచ్చి కట్టించారని ఎమ్మెల్యే తెలిపారు.27 రాష్ట్రాల్లో ఉన్న బిజెపి ముఖ్యమంత్రి ఏ సచివాలయం మీద డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టలేదని మన ముఖ్యమంత్రి సచివాలయం మీద డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు, కార్యకర్తలు, చుట్టుపక్క గ్రామాల ప్రజలు మహిళలు పురుషులు హాజరయ్యారు. ఇప్పటివరకు మాల ఫంక్షన్ హాల్లో పెర్కిట్ ఒకటి, చేపులో మూడు, మాక్లూర్ లో రెండు కట్టిస్తున్నాననిఆయన తెలిపారు.
-----------------------
Admin