సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం నారప్ప గారి పల్లి లో కుక్కల దాడికి 20 గొర్రెలు మృతి చెంది కష్టాల్లో ఉన్న బాధిత రైతు మల్లప్పను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఓదార్చారు ప్రమాద సంఘటనను విజయవాడలో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఫోన్ ద్వారా బాధిత రైతుతో ప్రమాదానికి కారణమైన ఘటనను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే బాధిత రైతులను ఆదుకొని తగిన పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు మృతి చెందిన గొర్రెలు స్థానంలో కొత్తగా గొర్రెలు ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు. అధైర్యపడవద్దని బాధిత రైతును ఓదార్చారు. టీడీపీ తరపున ఆదుకుంటామని భోరోసా ఇచ్చారు. బాధిత రైతును పరామర్శించి ధైర్యం ఇవ్వాలని మండల తెలుగుదేశం నాయకులకు ఫోన్ ద్వారా ఆయన ఆదేశాలు ఇచ్చారు.
-----------------------
Admin