Monday, 27 July 2026 06:25:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మిట్టపల్లి లో ప్రమాదవశాత్తు నీటిమడుగులో పడిన బాలిక మృతి...

Date : 25 May 2023 10:19 AM Views : 551

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువుమండల పరిధిలోని మిట్టపల్లి లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిమడుగులో పడి ఆఫ్రిన్ 16 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన రాజు సాబ్ ఇమాంబి బతుకుదెరువు కోసం బెంగళూరులో నివాసం ఉంటున్నారు. రాజు సాబ్ సోదరుడు బాబాసాహెబ్ ఇంట్లో దైవ కార్యక్రమము ఉండడంతో రాజు కుటుంబ సమేతంగా మిట్టపల్లి విచ్చేశారు. నిన్నటి రోజున అనంతపురం జిల్లా నార్పల మండలం గుగుడు కుళ్లాయ స్వామిని దర్శించుకుని వచ్చారు. నిన్నంతా ప్రయాణాల్లో అలసిపోయామని ఈరోజు విశ్రాంతి తీసుకుందామని ఇంటి వద్ద ఉండగా రాజు సాబ్ కుమార్తె అఫ్రీన్ తోటి పిల్లలతో కలిసి సోమావతి నది ఒడ్డున ఉన్న ఆలయం వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిమడుగులో పడిపోయింది. గుర్తించిన పిల్లలు గ్రామస్తులకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే బాలిక నీటిలో మునిగిపోవడంతో తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు :-- మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి --మిట్టపల్లి లో జరిగిన సంఘటన తెలుసుకొని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అక్కడికి చేరుకొని మృతదేహాన్ని నివాళులర్పించి మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారి కుటుంబాన్ని కొండంత ధైర్యం ఇచ్చి నేనున్నానని భరోసా ఇచ్చారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :