సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి.కోదాడ మండలంలోని నల్లబండ గూడెం గ్రామం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పాలేరు వాగు నీరు వరదల బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తుండటంతో నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి వరదనీరు చేరింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు.దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎందుకు ఆగిపోయాయో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.
-----------------------
Admin