Sunday, 26 July 2026 11:53:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కార్మికోద్యమాల విచ్చిన్నం చేసే చర్యలు మానుకోవాలి... - సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా

Date : 10 September 2023 07:29 AM Views : 229

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : చట్టపరమైన హక్కులు అమలు చేయాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఉద్యమాలను, పోరాటాలను సింగరేణి యాజమాన్యం జీర్ణించుకోలేకపోతోందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే హక్కు సింగరేణి అధికారులకు ఎవరిచ్చారని సిపిఐ భద్రాది జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా ప్రశ్నించారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ శనివారం మైనింగ్, టెక్నికల్ సబ్ కమిటీల ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్షల శిభిరం టెంటును తొలగించి దౌర్జన్యానికి పాల్పడిన సింగరేణి సెక్యూరిటీ గార్డులు, వారికి ఆదేశాలు జారీచేసిన అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంటును తొలగించిన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుబంద సంఘాల అనుమతులిస్తూ ఏఐటియుసి పట్ల వివక్షణత ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఉద్యమాలు, ఆందోళనలు, దీక్షలు చేసుకునే హక్కు ఎవరికి లేదని, యాజమాన్యం తీరు మార్చుకోని పక్షంలో తగిన రీతిలో గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, నూనావత్ గోవిందు, మాచర్ల శ్రీనివాస్, కిష్టోఫర్, జె. గట్టయ్య, కె.రాములు, కొచ్చెర్ల జోసఫ్, కె.సోమయ్య, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :