సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సింగరేణి లో ఎన్నికల కారణంగా నిలిచిపోయిన కారుణ్య నియామకాలు, ఎక్స్టర్నల్ ఉద్యోగులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ సింగరేణిలో మెడికల్ బోర్డు ద్వారా ఆన్ ఫిట్ అయిన కార్మికుల స్థానంలో డిపెండెంట్లకు నియామక పత్రాలు ఇవ్వాలని, అదేవిధంగా నియామక పత్రాలు అందజేసి రెండు రోజులు విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తెలంగాలో కాంగ్రెస్ అధికాంలోకి వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయనుకుంటే కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉద్యోగాలు వచ్చిన వారికి నియామక పత్రాలు ఇవ్వకుండా, సింగరేణి 177 ఎక్స్టర్నల్ ఉద్యోగాల భర్తీకి నియామకం జరిపిన యాజమాన్యం ఉద్యోగాల్లోకి తీసుకోకుండా కాలయాపన చేస్తుందని,ఉద్యోగ నియామకాల్లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు మెడికల్ టెస్టులు,ఇంటర్వ్యూలు,కౌన్సిలింగ్ పూర్తి చేసుకోగా వారికి ఆఫీస్ ఆర్డర్లు కూడా ఇచ్చారని వారు జీఎం కార్యాలయాల్లో రిపోర్ట్ కూడా చేశారని ఎన్నికల కోడ్ నెపంతో నియామక పత్రాలు ఇచ్చిన వారిని విధుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వం,సింగరేణి యాజమన్యం ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. సింగరేణి ఉద్యోగం రాగానే చాలా మంది చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామ చేసి వచ్చారని ఇప్పుడు వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందన్నారు. డిసెంబర్ 27 తో ఎన్నికల కోడ్ ముగిసిన ఇంకా విధుల్లోకి ఏందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డిపెండెంట్ ఉద్యోగులకు, ఎక్స్టర్నల్ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి, అసెంబ్లీ అధ్యక్షుడు చేనిగరపు నిరంజన్ కుమార్, మాలోత్ వీరు నాయక్, వంగా రవిశంకర్, అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin