Monday, 27 July 2026 05:32:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దేశాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి... - నాగ సీతారాములు టిపిసిసి సభ్యులు

Date : 16 August 2023 04:58 AM Views : 408

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : దేశాన్ని సన్మార్గం వైపు నడిపించి భారతీయుల సామరస్యాన్ని కాపాడి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రగతి పురోగతి నిలవాలంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి రావాలని నియంతృత్వ నియంతలుగా ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దుష్ట పాలన అంతమొందాలని టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు అన్నారు.కొత్తగూడెం నియోజకవర్గం కేంద్రంలో పొంగులేటి అభిమానులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాగా సీతారాములు, ఊకంటి గోపాల్ రావు బైక్ లపై నియోజకవర్గం అంతా పర్యటించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముందుగా తెలంగాణ ప్రచార కమిటీ కో -చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఊకంటి గోపాల్ రావుతో కలిసి జెండా ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు నివాళులు అర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఈరోజు ప్రధానంగా ముగ్గురిని మనం స్మరించుకోవాలన్నారు. ‘‘అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ .. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించారు అంబేద్కర్.. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశాన్ని సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ ఆని ఈ ముగ్గురిని మనం స్మరించుకుని నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పుకొచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ అని కొనియాడారు. దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలిపారు. అలాగే దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించింది పీవీ, మన్మోహన్ అని పేర్కొన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని బీజేపీ అవలంబిస్తోందని విమర్శించారు. విద్వేషాన్ని వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారన్నారు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు చేసిన 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారని దుయ్యబట్టారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశంలో దూసుకుపోతున్నాయని వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని, దేశం లోని భారతీయులందరికీ సీతారాములు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, నాగేంద్ర త్రివేది, కనకరాజు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ మడిపల్లి శ్రీనివాసులు, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కరీం పాషా, ఓబీసీ కొత్తగూడెం మండల అధ్యక్షులు అమడగాని జయప్రకాష్, సుజాతనగర్ మండల ఓబిసి అధ్యక్షులు కసనబోయిన లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు రామ లక్ష్మణ్, కోటిరెడ్డి,సమ్మయ్య, చిమట నాగేశ్వరావు, పూనెం శ్రీను, వెంకటేశ్వర్లు, గాలి వెంకన్న, గోరె,పాషా యువజన కాంగ్రెస్ నాయకులు బొల్లం ఉదయ్, ప్రసాద్, రాజు, సతీష్, శేఖర్, నవీన్, హరీష్, సాయి, నరేష్,అజయ్ జిల్లా నాయకులు, మండల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: