సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గారి కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం... అక్టోబర్ 12 జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జెవిఎల్ శిరీష గారి ఆదేశానుసారం... డిప్యూటీ డిఎంహెచ్వో కొత్తగూడెం డాక్టర్ సుకృత ఆధ్వర్యంలో... జిల్లాలోని కారుకొండ రామవరం మరియు కొత్తగూడెం కేంద్రంలో ఉన్న పలు ఆర్.ఎం.పి సెంటర్లను తనిఖీ చేయడం జరిగినది., అర్హత లేని వారు వైద్యం చేస్తున్నందున వారికి నోటీసులు జారీ చేయడం జరిగినది .అక్కడ వైద్యం చేయించుకుంటున్న రోగులను వైద్య బృందం వెంట తీసుకొని మన జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు జాయిన్ చేయించి చికిత్స అందించడం జరిగినది .ఈ నివేదికను జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిని కి అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమోలు ఎండి ఫైజ్ మోహిద్దిన్, నాగలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ సాంబ పాల్గొన్నారు..
-----------------------
Admin