సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట. నర్సంపేట మండలం గురజాల గ్రామానికి చెందిన కండక్టర్ గొలనకొండ వేణు గత కొన్ని సంవత్సరాల నుండి నర్సంపేట డిపోలో కండక్టర్ గా పనిచేస్తూనే వేణు సామాజిక సేవా రంగంలో కొనసాగుతూ వస్తున్నారు అతని సేవలను గుర్తించి ఇటీవల తెలుగు సంస్కృతి సాహితి సేవ ట్రస్ట్ వారు ప్రముఖ సినీ నటులు, మాజీ మంత్రి బాబు మోహన్ చేతుల మీదుగా కండక్టర్ వేణు హైదరాబాదులో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు చేసినటువంటి సామాజిక సేవ దృశ్యమాలికాల తోటి తయారు చేయించిన భారీ జ్ఞాపికను తోటి సాహో ఉద్యోగులు డిఎం ప్రసూనలక్ష్మి చేతుల మీదుగా వేణుకు శుక్రవారం రోజున జ్ఞాపికను అందించి అభినందించడం జరిగింది ఇంకా ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా దీవించడం జరిగింది ప్రతి ఒక్కరు వేణుని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిపో సహాయ మేనేజర్ కె. రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి, బొడిగె రాజు, ఎండి.జానీపాషా, డ్యాగల వెంకట్రాంనరసయ్య, బూర ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, హరిప్రసాద్, మహేష్, రాములు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter