సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రజల ఆశలు, ఆకాంక్షలు అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని, ప్రజాహిత అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం అర్షనీయమని సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందిస్తూ విద్య, వైద్యం, గృహవసతి విద్యుత్ వంటి ప్రధాన అంశాలకు పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిపారని అన్నారు. ప్రజా పాలన అందిస్తారని నమ్మకంతోనే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని ఆ నమ్మకానికి అనుగుణంగా కేటాయింపులు జరిపినప్పటికీ నిధుల విడుదలలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టి పి ఎస్ సి కి రూ.40 కోట్లు కేటాయించడం నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించే అంశం అని అన్నారు. వ్యవసాయ రంగానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, కేవలం రూ.19 వేల కోట్లతోనే రైతు భరోసా ఇతర రైతు సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలు మాత్రమే సర్వరోగ నివారణ కాదని, ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని అన్నారు. బడ్జెట్ లోని అంశాలు, ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోని హామీలను అమలు చేసేందుకు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల నిధులు, వాటాలు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.
-----------------------
Admin