సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నియోజకవర్గంలో ఉన్న మక్తల్, మాగనూర్, కృష్ణ, ఉట్కూర్, అమరచింత, ఆత్మకూర్, నర్వ మండలాలలో ఉన్న గ్రంథాలయాల్లో కనీస వసతులు లేక గ్రంథాలయానికి పఠనం కోసం వస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారని ప్రతిరోజు గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అధికారులు నిత్యం గ్రంథాలయాల కోసం వెళుతుంటారు. గ్రంథాలయం విద్యార్థులకు దేవాలయంలా ఉపయోగపడుతుందని అన్నారు. అలాంటి గ్రంథాలయాల్లో మక్తల్ నియోజకవర్గాల్లో ఆ గ్రంథాలయాన్ని పట్టించుకునే నాధుడే లేడని పాఠకులు అంటున్నారు. అదేవిధంగా గ్రంధాలయానికి వచ్చే నిధులు కూడా గ్రంథాలయాన్ని నిర్వహించే ఉద్యోగులకు జీతాలు కూడా గత అరు మాసాలుగారావడం లేదని వారు అన్నారు. కనీసం నీటి వసతి లేదన్నారు. రోజువారిగా వచ్చే దినపత్రికలు సైతం గత పది రోజుల నుంచి రావడంలేదని పాటకులో ఆందోళన చెందుతున్నారు ఈ గ్రంథాలయం పై మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యను తీర్చాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రసముద్రం రామలింగం పాలమూరు పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి, జి నారాయణRTI జిల్లా అధ్యక్షులు, గోపాల్ రెడ్డి, కిష్టప్ప , తిప్పన, అబ్దుల్, రషీద్, మైలుద్దీన్, నరసింహ, హీరోలాల్ విద్యార్థులు ప్రైవేటు ప్రభుత్వ విద్యార్థులు తదితరులు కోరుతున్నారు....
-----------------------
Admin