సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి : వ్యాపారం వాణిజ్యపరంగా దినదినం అభివృద్ధి చెందుతూ నాలుగు జిల్లాలకు కూడలి అయిన తిరుమలగిరి మున్సిపల్ కేంద్రం తెలంగాణ చౌరస్తాలో బస్టాండ్ లేకపోవడం మూలంగా ప్రజలు ప్రయాణికులు బస్సుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి రోడ్డుపై నిలబడి గంటలపాటు ఎదురు చూడాల్సి వస్తుందని పలువురు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తిరుమలగిరిని మున్సిపాలిటీగా ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు కనీసం ప్రయాణికులు నిలబడడానికి బస్ షెల్టర్ నిర్మించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని పలువురు తెలిపారు. జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్న తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు రైతులు రావడం మరియు మండల కేంద్రం నుండి సూర్యాపేట, జనగాం, హైదరాబాద్, వరంగల్, విజయవాడ లాంటి పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు తెలిపారు. ప్రతి సంవత్సరం తిరుమలగిరి కి మార్కెట్ సంత మున్సిపాలిటీ పన్నుల రూపంలో లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న కనీసం ప్రయాణికులకు బస్టాండ్ సౌకర్యం కల్పించకపోవడంలో పూర్తిగా విఫలమైందని పలువురు తెలిపారు.బస్ స్టాండ్ లేకపోవడంతో మూడు బస్సులు ఎదురెదురుగా ఒకేసారి రావడంతో ఇటు ప్రయాణికులకు, అటు ట్రాఫిక్ కూ అంతారాయం జరిగింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి ప్రయాణికులు,ప్రజల సౌకర్యం కోసం బస్ స్టాండ్ ను నిర్మించాలని పలువురు కోరుతున్నారు.
-----------------------
Admin