సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రాబోయే ఎన్నికల్లో యువత మొత్తం టిఆర్ఎస్ పార్టీ వైపు అండగా నిలవబోతున్నారని, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గెలుపుకు పక్కా పోరాడబోతున్నారని టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గోటిక గోపాల్ రెడ్డి అన్నారు. స్థానిక టిఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే యాదవ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు డేవిడ్ (మున్నా) ఆధ్వర్యంలో తదితర యువత 200 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు దీపక్ రామ్, సురేష్, అనిల్ పృథ్వి జ్ఞాని శివ ప్రసాద్ శ్రీకాంత్ ధర్మ హర్ష, అదేవిధంగా జోయల్ జార్జ్ బాల్ మోడల్ అఖిల్ శరత్ తదితరులతోపాటు పెద్ద ఎత్తున యువకులు క్రీడాకారులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం యువ నాయకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అంజయ్య మంచితనమే ఆయనకు శ్రీరామరక్ష ఆని మూడవసారి పక్క గెలుస్తున్నారని అన్నారు. మొత్తం ఐదు వేల మంది యువత వరకు పార్టీలో చేర్పిస్తానని గోపాల్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పల్లె షాద్ నగర్ నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే అంజయ్య మూడోసారి గెలిస్తే నియోజకవర్గంలో కనివిని ఎరుగని అభివృద్ధి జరగబోతుందని అన్నారు.
-----------------------
Admin