సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలం, పస్పుల గ్రామంలో నివాసం ఉంటున్న బొడ్డునోళ్ళ లక్ష్మప్పను, అల్లుడు అయినా గోపి మల్లేష్ మామను హతమార్చిన సంఘటన పస్పుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, లక్ష్మప్ప పెద్ద కూతురు అయిన రేణుక కు జడ్చర్ల మండలం, ఆలూరు గ్రామానికి చెందిన గోపి మల్లేష్ తో ఇల్లరికంగా వివాహం చేసి అల్లుడుగా తెచ్చుకున్నాడు. అల్లుడైన మల్లేష్ సరిగ్గా వ్యవసాయం పనులు చేయడం లేదని మామ అయిన లక్ష్మప్ప పలుమార్లు ఇల్లరికం అల్లుడిని మందలించేవాడు. శుక్రవారం అల్లుడు సరిగ్గా పొలం పనులు చేయడం లేదని మామ మందలించగా, అల్లుడు క్షణికావేశంతో మామను వ్యవసాయ పనిమూట్లతో తల, చెవి, వీపుపై కొట్టగా గాయాలవ్వగ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోవడం జరిగిందని మృతుని బామర్ది అయిన బోడ్డ నోళ్ళ నర్సిములు తెలపడం జరిగిందన్నారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇల్లరికం అల్లుడైన మల్లేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మక్తల్ ఎస్సై పర్వతాలు తెలిపారు.
-----------------------
Admin