Monday, 27 July 2026 03:25:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఈ గ్రామ్ స్వరాజ్ లో జి.పి.అభివృద్ధి ప్రణాళికలు అప్ లోడ్ చేయండి... - అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక

Date : 01 February 2024 12:17 PM Views : 358

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జిల్లాలో ఇంటి పన్ను వసూలు నిర్దేశించిన సమయంనాటికి నూరు శాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సర్పంచుల పదవీ కాలం త్వరలో ముగియనున్నందున పారదర్శకంగా అన్ని జి.పి.లకు ప్రత్యేక అధికారుల నియామక ప్రణాళికలు సిద్ధంచేయాలని సూచించారు. ముక్యంగా ఎక్కడకూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించవద్దని పేర్కొన్నారు. జి.పి లలో పన్ను వసూలు నిర్దేశించిన సమయానికి నూరు శాతం వసూలు అయ్యేలా చూడాలని, ఇప్పటివరకు 56 శాతం పన్ను వసూలు చేయడం జరిగిందని అలాగే ఎం.పి.ఓ లు పన్ను వసూలు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీల నుండి కూడా పన్ను వసూలు చేపట్టాలని సూచించారు. జి.పి.లలో అత్యవసరమున్న జి.పి. భవనాలు, కాంపౌండ్ వాల్స్, పాఠశాలలో అదనపు గదులు నిర్మాణం అలాగే మరమ్మత్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిశగా ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. జి.పి.లలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు ఈ గ్రామ్ స్వరాజు పోర్టల్ లో అప్ లౌడ్ చేయాలని సూచించారు. 197 జి.పి.లలో ఎఫ్.టి.ఓ ల మేరకు చేపట్టిన మరుగుదొడ్ల లకు నిబంధనల మేరకు చెల్లింపులు చేపట్టాలని తెలిపారు. అనంతరం మండలాల వారీగా ఇంటి పన్ను వసూలు, ప్రత్యేక అధికారుల నియామకం, ఈ జి ఎస్ పనుల పై సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సమావేశంలో సి.ఈ.ఓ సురేష్ కుమార్, డిఆర్డీఓ కిరణ్ కుమార్, డి.పి.ఓ యాదయ్య, ఎంపీడీఓ లు, ఎం.పి.ఓ లు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: