Monday, 27 July 2026 02:31:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రాణం తీసిన క్రికెట్ ఐపీఎల్ బెట్టింగ్... నాగూర్లగడ్డ తండాలో ప్రకాష్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య.

Date : 19 May 2023 01:04 AM Views : 559

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులకు పండగలా ఉన్న ఐపీఎల్‌ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీలను అందరూ ఆస్వాదిస్తుంటే.. కొందరు మాత్రం బెట్టింగ్‌ ఉచ్చులో ఇరుక్కుని అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్‌ జోరుగా సాగుతోందని అనుమానాలు జోరుగా సాగుతున్నాయి. రోజుకూ రూ.2కోట్లకు పైగా చేతులు మారుతున్నాయని సమాచారం. షాద్ నగర్ ఒక్కటే కాదు.. నియోజక వర్గ వ్యాప్తంగా పలు పల్లెల్లో సైతం క్రికెట్‌పై బెట్టింగ్‌ సాగుతోంది. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ (19) అనే యువకుడు బెట్టింగ్ లో పాల్గొని ఓడిపోయాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్ లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో తన మిత్రులు బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. తాండకు చెందిన పలువురు ప్రజలు ప్రకాష్ ఆత్మహత్యను చూసి విలపిస్తున్నారు. చిన్నారి భవిష్యత్తు చిత్రమైందని భావించి కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. తాండకు చెందిన ఆంగోతు అమరుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది ప్రకాష్ చిన్న కుమారుడు. ఇలా అర్ధాంతరంగా బెట్టింగ్ ఉచ్చులో పడి ఆత్మహత్య చేసుకోవడం తండాను కలచివేస్తుంది. చాలా దారుణం - వీర్లపల్లి శంకర్ దిగ్భ్రాంతి. యువకుడు ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై వీర్లపల్లి శంకర్ స్పందించారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో పోస్టుమార్టం గదిలో ఉన్న శవాన్ని సందర్శించారు. ప్రకాశ్ మృతి పట్ల విచారణ వ్యక్తం చేశారు. బెట్టింగ్ ముఠా నుండి యువకులను పోలీసులు రక్షించాలని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతపై ఒక డేగ కన్ను వేయాలని, పోలీసులు ఆ దిశగా ప్రత్యేక కోణం ద్వారా విచారణ జరిపి బెట్టింగ్ ముఠాను గుట్టు రట్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేవలం చలాన్లు ఇతర చిన్నచిన్న నేరాల కాకుండా ఇలాంటి మోసాలపై బెట్టింగ్ లపై దృష్టి సారించాలని సూచించారు. ప్రకాష్ తల్లిదండ్రులను పరామర్శించారు. పల్లె మొదలు పట్టణం వరకు. పల్లె మొదలు పట్టణం వరకు.. యువకుడి మొదలు ముసలివాళ్ల వరకూ అందరినీ అలరించేది క్రికెట్‌. దేశవ్యాప్తంగా క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఒకప్పుడు టెస్టులు, వన్డేమ్యాచ్‌లకు పరిమితమైన క్రికెట్‌ 2020 రాకతో దీని స్వరూపమే మారింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) రాకతో క్రికెట్‌ క్రికెట్‌ మరింతగా దగ్గరైంది. ఎలా అంటే.. మహిళలు కూడా క్రికెట్‌ను ఆదరిస్తున్నంతగా.. అయితే ఎంత ప్రాచుర్యం పొందిందో అంతే స్థాయిలో బెట్టింగ్‌ విస్తరించింది. 4జీ, కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో క్రికెట్‌ అందుబాటులోకి రావడంతో టీవీల కన్నా మొబైల్స్‌లోనే ఎక్కువగా చూస్తున్నారు. ఈ సీజన్‌లో అయితే మైజియో ద్వారా లైవ్‌ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయింది. అభిమాన క్రికెటర్లు గ్రౌండ్‌లో బాదేస్తూ ఫోర్లు, సిక్సర్లతో అభిమానులను అలరిస్తుంటే.. కొంత మంది దానిని జూదంగా మార్చుకుని రూ.10వేలు, రూ.50వేలు, రూ.లక్ష, రూ.పది లక్షలు అంటూ పందేలు కట్టేస్తున్నారు. వెరసి జిల్లా వ్యాప్తంగా రోజూ రూ.2 కోట్ల నుంచి రూ.4కోట్ల దాకా బెట్టింగ్‌ జరుగుతున్నట్లు అంచనాగా చెబుతున్నారు.. ఇటీవల షాద్ నగర్ పట్టణంలో బెట్టింగ్ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సంఘటన మరవకముందే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: