సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిందని స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. జీవో ఎంఎస్ 35 ఉత్తర్వుల ప్రకారం నియోజక వర్గానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు అయిందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హర్షం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కళాశాల కోసం అభ్యర్థించగా ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం కళాశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషమని అంజయ్య కొనియాడారు. ఈ సందర్భంగా రూ.16.49 కోట్ల రూపాయలతో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో మొత్తం మూడు కోర్సులు ఉంటాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కళాశాల మూడు కోర్సులను అందిస్తుందని డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేన్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రనిక్స్ ఇంజినీరింగ్‌తో ఒక్కో బ్రాంచ్‌లో 60 సీట్లు ఉంటాయని అన్నారు. అడిగిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సహృదయంతో స్పందించి కళాశాలను మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్ బచ్చలి నరసింహులు, సీనియర్ నేత యుగంధర్ తదితరులు హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య కృషికి వారు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే అంజయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం విశేషం.
-----------------------
Admin