సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బీఆర్ఎస్ తోనే షాద్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యపడుతుందని బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలీం భాయ్, మాజీ సర్పంచ్ కృష్ణ అనుచరులు. కొందుర్గ్ మండలం చిన్న ఎలల్కిచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలీం, మాజీ సర్పంచ్ కృష్ణ మరియు యువకులు 150 మంది కార్యకర్తలు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని అందుకే బీఆర్ఎస్ లో చేరుతున్నామని అన్నారు, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొందూర్గు ఉమ్మడి మండలాల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
-----------------------
Admin