సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : నల్లమాడ మండలం కురుమాల గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు... ఈ సందర్భంగా రైతులు నూతన వ్యవసాయ విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చనీ రమణారెడ్డి నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. అలాగే పండ్లతోటలు పెంపకం , కూరగాయల పెంపకం , లాంటి పంటలకు ఎలాంటి విత్తనాలు వాడాలో ,ఎలాంటి ఎరువులు వేయాలో, క్షుణ్ణంగా రైతులకు వివరించారు. వ్యవసాయానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా రైతులు ఆర్ బి కే ద్వారా సేవలను వినియోగించుకోవాలన్నారు. రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల సూచనలతో పంటలు పెట్టి, అధిక దిగుబడి సాధించాలని సూచించారు. వేసిన ఏ పంటకైనా చీడపురుగులు ఆశించకుండా ముందుగానే అరికట్టేందుకు తగిన మందులు పిచికారి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమాడ మండల అగ్రి చైర్మన్ రఘునాథ్ రెడ్డి , సర్పంచ్ లింగమూర్తి , వైసీపీ నాయకులు అశోక్ రెడ్డి , రెడ్డప్ప , మండల వ్యవసాయ అధికారి సుమతి , వి ఏ షాన్ , మరియు రైతులు , వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin